రోడ్డు నిర్మాణంను పరిశీలించిన డిప్యూటీ సీఎం: పవన్ 4 h ago
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పిఠాపురం పర్యటనకు వెళ్లారు. రాజమహేంద్రవరం నుంచి పిఠాపురానికి వెళ్ళి, రామస్వామిపేట ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రారంభతేదీ, వాటి పురోగతి వివరాలను జిల్లా కలెక్టర్ పి. ప్రసాంతి, ఇతర అధికారుల నుండి తెలుసుకున్నారు. రోడ్డువెంట నడుస్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈ వెంట్ సమయంలో వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.